దోహాలో జ‌రుగుతున్న ఆసియన్ అథ్లెటిక్స్‌లో చివ‌రి రోజు ఇండియా నాలుగు బంగారుప‌త‌కాల‌ను గెలుచుకుని నాలుగో స్థానం లో నిలిచింది.


దోహ‌లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్స్ చివ‌రి రోజున భార‌త ఒక వ్వ‌ర్ణ ప‌త‌కంతో స‌హా నాలుగు ప‌త‌కాల‌ను సాధించింది.2017లో తానుగెలుచుకున్న మ‌హిళ‌ల1500మీట‌ర్ల ప‌రుగుపందెం స్వ‌ర్ణ పత‌కాన్ని చిత్రా విజ‌య‌వంతంగా నిల‌బెట్టుకున్నారు. పురుషుల1500మీట‌ర్ల పందెం లో అజ‌య్ కుమార్ స‌రోజ్‌,మ‌హిల‌ల4 X 400మీట‌ర్ల రిలే లో భార‌త్ ర‌జ‌త‌ప‌త‌కాన్ని సాధించిన‌ట్లు ముందు ప్ర‌క‌టించినా,చైనా నిర‌స‌న తెలిపాక ఒక అథ్లెటిక్‌కు ఆటంకం క‌లిగిందినందుకు ఆ బృందాన్ని అన‌ర్హులుగా జ్యూరీ ప్ర‌క‌టించింది. ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త నాల్గ‌వ స్థానంలో నిలిచింది. బిహ్రెయిన్ ప‌ట్టిక‌లో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా,చైనా ద్వితియ‌స్థానంలో,జ‌పాన్ తృతియ స్థానంలో నిలిచాయి.

Continue Reading...

లిబ్యా వ‌దిలిపెట్టే బార‌తీయుల‌కు స‌హాయ‌ప‌డేందుకు 17 మంది కో-ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మిస్తున్న‌ట్లు విదేశాయంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ చెప్పారు.


లిబియా నుంచి భారతీయుల తరలింపులో సహాయ పడేందుకు 17 మంది సమన్వయ కర్తలను నియమించినట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అక్కడి నుంచి స్వదేశాలకు రావాలనుకుంటున్న వారందరికీ సహాయం చేసేందుకు భారత రాయబార కార్యాలయం పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోందని ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా లిబియాలోని ప్రవాస భారతీయులను ఆమె కోరారు. అక్కడి పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్వదేశం రావాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనీ,ఆ తర్వాత ప్రభుత్వం ఖాళీ చేయించలేదని ఆమె అన్నారు.

Continue Reading...

వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్ ఈరోజు కాంగ్రేస్ పార్టీలో చేరారు. కొత్త ఢిల్లీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ స‌మక్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి బిజెపి ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు.

Continue Reading...

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. 6వ విడ‌త ఎన్నిక‌ల కు నామినేష‌న్ల ప‌రిశీల‌న ఈరోజు జ‌రుగుతోంది.


నాల్గవ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తొమ్మిది రాష్ట్రాల్లో 71 లోక్ సభ నియోజకవర్గాల్లో సోమవారం ఎన్నిక పోలింగ్ జరగనుంది. ప్రదాన రాజకీయ పార్టీల అగ్రనాయకులు తమ అభ్యర్ధుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చశారు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు పశ్చిమ బెంగాల్ లోని బీర్భం, నాడియా జిల్లాల్లోనూ, జాఖండ్ లోని లోహార్ దాగా లోనూ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ లోని ముంగేర్, బేగుసరాయ్, సమస్తిపూర్లలోనూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ, ఉన్నావో, కాన్పూర్ లలోనూ, పార్టీ ప్రధాన కార్యదర్శి హమీర్ పూర్, ఫతేపూర్ లలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఈ దశలో మహారాష్ట్రలోని 17 నియోజకవ్గాల్లోనూ, త్తరప్రదేశ్, రాజస్థాన్ లలోని చెరి 13 నియోజకవర్గాల్లోనూ, పశ్చిమ బెంగాల్ లోని 8 నియోజకవర్గాల్లోనూ, ఒడిషా, మధ్య ప్రదేశ్ లలో చెరి 6 నియోజకవర్గాల్లోనూ బీహార్ లోని 5 నియోజకవర్గాల్లోనూ, జార్ఖండ్ లో మూడు స్థానాలో పోలింగ్ జరుగుతుంది ఇలా ఉండగా ఆరవ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నామినేషన్ల వరిశీలన నేడు జరుగుతుంది. ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో ఈ దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏడవ దశల్లో పోలింగ్ జరుగుతోంది. మొదటి మూడు దశలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Continue Reading...

బెంగ‌ళూరులో జ‌రిగిన ఐ.పి.ఎల్‌. క్రికెట్లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ పై 17 ప‌రుగులతో విజ‌యం సాధించింది.


ఐపీఎల్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో భాగంగా నిన్న రాత్రి బెంగళూరులో‘‘కింగ్స్ ఎలెవ‌న్- పంజాబ్’’జ‌ట్టుతో మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌- బెంగ‌ళూరు జ‌ట్టు17ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. ఇప్పటివరకూ ఏడు ఓటములతో వెనుకబడి ఉన్న బెంగళూరు జట్టుకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మొత్తం8జట్లతో కూడిన పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు7వ స్థానంలో ఉన్నప్పటికీ,ప్లే-ఆఫ్ దశకు అర్హత సాధించగల అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం చెన్న సూపర్ కింగ్స్,ఢిల్లీ కేపిటల్స్,ముంబై ఇండియన్స్ జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Continue Reading...

దోహాలో జ‌రుగుతున్న ఆసియన్ అథ్లెటిక్స్‌లో చివ‌రి రోజు ఇండియా నాలుగు బంగారుప‌త‌కాల‌ను గెలుచుకుని నాలుగో స్థానం లో నిలిచింది.


దోహ‌లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్స్ చివ‌రి రోజున భార‌త ఒక వ్వ‌ర్ణ ప‌త‌కంతో స‌హా నాలుగు ప‌త‌కాల‌ను సాధించింది.2017లో తానుగెలుచుకున్న మ‌హిళ‌ల1500మీట‌ర్ల ప‌రుగుపందెం స్వ‌ర్ణ పత‌కాన్ని చిత్రా విజ‌య‌వంతంగా నిల‌బెట్టుకున్నారు. పురుషుల1500మీట‌ర్ల పందెం లో అజ‌య్ కుమార్ స‌రోజ్‌,మ‌హిల‌ల4 X 400మీట‌ర్ల రిలే లో భార‌త్ ర‌జ‌త‌ప‌త‌కాన్ని సాధించిన‌ట్లు ముందు ప్ర‌క‌టించినా,చైనా నిర‌స‌న తెలిపాక ఒక అథ్లెటిక్‌కు ఆటంకం క‌లిగిందినందుకు ఆ బృందాన్ని అన‌ర్హులుగా జ్యూరీ ప్ర‌క‌టించింది. ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త నాల్గ‌వ స్థానంలో నిలిచింది. బిహ్రెయిన్ ప‌ట్టిక‌లో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా,చైనా ద్వితియ‌స్థానంలో,జ‌పాన్ తృతియ స్థానంలో నిలిచాయి.

Continue Reading...

ర‌ష్యా దేశాధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్త‌ర కొరియా నాయ‌కుడు కిమ్ జంగ్ ఎన్ వ్లాదివోస్టోక్ న‌గ‌రంలో ఈరోజు మొద‌టి శిఖ‌రాగ్ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.


ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్,రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య ఈరోజు వ్లాదీవోస్తోక్ నగరంలో మొదటి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. కొరియా పరమాణు సమస్యపై ఇరువురు నేతలు చర్చిస్తారని రష్యా తెలిపింది. కిమ్ నిన్ననే రష్యా చేరుకున్నారు. కొరియా పరమాణు ఆయుధాల కార్యక్రమంపై ఈ ఏడాది మొదట్లో హానోయ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన శిఖరాగ్ర చర్చల్లో ఒక అంగీకారానికి రావడంలో జరిగిన వైఫల్యం తర్వాత కిమ్ ఇప్పుడు రష్యా సహకారం కోరతారని భావిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొరియా ప్రాంతంలో పరిస్థితి నిలకడగా ఉందని,రష్యా అధ్యక్షుని విదేశీ విధాన సహాయకుడు యూరీ ఊషకోవ్ చెప్పారు. సానుకూల పరిష్కారానికి రష్యా సాధ్యమైన సహాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా పరమాణు కార్యక్రమానికి స్వస్తి చెప్పడానికి రష్యా గతంలో కూడా చర్చల్లో పాల్గొంది.

Continue Reading...