రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జంగ్ ఎన్ వ్లాదివోస్టోక్ నగరంలో ఈరోజు మొదటి శిఖరాగ్ర చర్చలు జరుపుతున్నారు.
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్,రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య ఈరోజు వ్లాదీవోస్తోక్ నగరంలో మొదటి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. కొరియా పరమాణు సమస్యపై ఇరువురు నేతలు చర్చిస్తారని రష్యా తెలిపింది. కిమ్ నిన్ననే రష్యా చేరుకున్నారు. కొరియా పరమాణు ఆయుధాల కార్యక్రమంపై ఈ ఏడాది మొదట్లో హానోయ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన శిఖరాగ్ర చర్చల్లో ఒక అంగీకారానికి రావడంలో జరిగిన వైఫల్యం తర్వాత కిమ్ ఇప్పుడు రష్యా సహకారం కోరతారని భావిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొరియా ప్రాంతంలో పరిస్థితి నిలకడగా ఉందని,రష్యా అధ్యక్షుని విదేశీ విధాన సహాయకుడు యూరీ ఊషకోవ్ చెప్పారు. సానుకూల పరిష్కారానికి రష్యా సాధ్యమైన సహాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా పరమాణు కార్యక్రమానికి స్వస్తి చెప్పడానికి రష్యా గతంలో కూడా చర్చల్లో పాల్గొంది.
Continue Reading...
ఇరాన్ పై ఆంక్షల వల్ల ఛాబహర్ రేపు ప్రాజెక్టుపై ఎటువంటి ప్రభావం ఉండబోదని అమెరికా చెబుతుంది.
ఇరాన్‘పై తమ ఆంక్షల ప్రభావం చాబహర్ ఓడరేవు ప్రాజెక్టుపై పడబోదని అమెరికా ప్రకటించింది. ఇరాన్‘లోని ఈ రేవును భారత్ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఈ మేరకు తెలిపారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతిపై భారత్ తో సహా తమ ఆంక్షల సడలింపు పొందిన 8 దేశాలకు వచ్చే నెలనుంచి ఆ మినహాయింపును పొడిగించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి సహాయ పథకానికి సంబంధించి ఇరాన్ మీద ఆంక్షలను అమెరికా సడలించింది. చాబహర్ ఓడరేవు అభివృద్ధి-నిర్వహణ కూడా ఈ పథకంలో భాగంగా ఉండటంతో దీని విషయంలో సడలింపు కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
Continue Reading...
రాఫెల్ కేసులో తమ తీర్పుపై వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ధిక్కార నోటీస్ జారీ చేసింది.
రాఫేల్ కేసులో తమ తీర్పును ప్రధాని నరేంద్ర మోదీకి ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేయడంద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‘గాంధీకి సుప్రీం కోర్టు నిన్న నోటీసు జారీచేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలలో తమ తీర్పును తప్పుగా ఆపాదించారని చీఫ్ జస్టిస్ రంజన్ గొగయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై బీజేపీ ఎంపీ ‘మీనాక్షి లేఖి’ దాఖలు చేసిన నేరపూరిత కోర్టు ధిక్కార పిటిషన్‘పై ఈ నెల 30న విచారణ చేపడతామని ప్రకటించింది. రాఫేల్ యుద్ధ విమానాల కేసులో తీర్పును సవాలు చేస్తూ నిరుడు డిసెంబరులో దాఖలైన పిటిషన్‘ను కూడా దీనితో కలిపి విచారిస్తామని తెలిపింది. కాగా, లేఖి దాఖలు చేసిన పిటిషన్‘ను మూసివేయాలని కోరుతూ రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను ఈ సందర్భంగా ధర్మాసనం తోసిపుచ్చింది.
Continue Reading...
నిన్న 3వ విడత లోక్ సభ ఎన్నికలు జరిగిన 116 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ 66 శాతం నమోదైంది.
నిన్న జరిగిన 3వ విడత లోక్ సభ ఎన్నికలలో 66 శాతం పోలింగ్ నమోదైంది. కొత్త ధిల్లీలో నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం సీనియర్ ఉప కమిషనర్ ఉమేష్ సిన్హా, చిన్న చిన్న సంఘటనలు మినహా 116 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. 543 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 303 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిందని చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించున్నారు. త్రిపురలో 79.64 శాతం, పశ్చిమబెంగాల్ లో 78.97, అస్సోంలో 74.05 , కేరళలో 73.06, డామన్ అండ్ డయ్యులో 73 శాతం, దాదర్ నగర్ హవేలీలో 71.43, గోవాలో 70.90, ఛత్తీస్ ఘడ్ లో 64.02 శాతం, కర్ణాటకలో 60.42, గుజరాత్ లో 59 శాతం, బీహార్ లో 60 శాతం, మహారాష్ట్రలో 62, ఉత్తరప్రదేశ్ లో 60.52, మహారాష్ట్రలో 62, ఉత్తరప్రదేశ్ లో 60.52, జమ్ముకశ్మీర్ లో 12.86 శాతం ఓటింగ్ జరిగిందని వివరించారు. ఒడిషా లో లోక్ సభకు, అసెంబ్లీకి జరిగిన ఏక కాల ఎన్నికలలో 64 శాతం పోలింగ్ నమోదైందని ఉమేష్ సిన్హా వివరించారు.
Continue Reading...
లిబ్యా వదిలిపెట్టే బారతీయులకు సహాయపడేందుకు 17 మంది కో-ఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు విదేశాయంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు.
లిబియా నుంచి భారతీయుల తరలింపులో సహాయ పడేందుకు 17 మంది సమన్వయ కర్తలను నియమించినట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అక్కడి నుంచి స్వదేశాలకు రావాలనుకుంటున్న వారందరికీ సహాయం చేసేందుకు భారత రాయబార కార్యాలయం పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోందని ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా లిబియాలోని ప్రవాస భారతీయులను ఆమె కోరారు. అక్కడి పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్వదేశం రావాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనీ,ఆ తర్వాత ప్రభుత్వం ఖాళీ చేయించలేదని ఆమె అన్నారు.
Continue Reading...
వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్ ఈరోజు కాంగ్రేస్ పార్టీలో చేరారు. కొత్త ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి బిజెపి ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
Continue Reading...
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 6వ విడత ఎన్నికల కు నామినేషన్ల పరిశీలన ఈరోజు జరుగుతోంది.
నాల్గవ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తొమ్మిది రాష్ట్రాల్లో 71 లోక్ సభ నియోజకవర్గాల్లో సోమవారం ఎన్నిక పోలింగ్ జరగనుంది. ప్రదాన రాజకీయ పార్టీల అగ్రనాయకులు తమ అభ్యర్ధుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చశారు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు పశ్చిమ బెంగాల్ లోని బీర్భం, నాడియా జిల్లాల్లోనూ, జాఖండ్ లోని లోహార్ దాగా లోనూ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ లోని ముంగేర్, బేగుసరాయ్, సమస్తిపూర్లలోనూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ, ఉన్నావో, కాన్పూర్ లలోనూ, పార్టీ ప్రధాన కార్యదర్శి హమీర్ పూర్, ఫతేపూర్ లలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఈ దశలో మహారాష్ట్రలోని 17 నియోజకవ్గాల్లోనూ, త్తరప్రదేశ్, రాజస్థాన్ లలోని చెరి 13 నియోజకవర్గాల్లోనూ, పశ్చిమ బెంగాల్ లోని 8 నియోజకవర్గాల్లోనూ, ఒడిషా, మధ్య ప్రదేశ్ లలో చెరి 6 నియోజకవర్గాల్లోనూ బీహార్ లోని 5 నియోజకవర్గాల్లోనూ, జార్ఖండ్ లో మూడు స్థానాలో పోలింగ్ జరుగుతుంది ఇలా ఉండగా ఆరవ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నామినేషన్ల వరిశీలన నేడు జరుగుతుంది. ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో ఈ దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏడవ దశల్లో పోలింగ్ జరుగుతోంది. మొదటి మూడు దశలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Continue Reading...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)